తేజ సినిమాలో విలన్‌గా సోనూసూద్

అరుంధతి సినిమాలో బొమ్మాలి నిన్ను వదలా అనే డైలాగ్‌ వినిపించగానే మనకు సోనూసూద్ గుర్తుకు వస్తాడు. బలిష్టమైన శరీరంతో.. అఘోరా పాత్రలో తన అభినయంతో అందరిని భయపెట్టాడు సోనూసూద్. టాలీవుడ్ లో అనేక చిత్రాల్లో నటించిన సోనుసూద్ అభినేత్రి ఆఖరి సినిమా. ఆ తరువాత తెలుగులో సినిమాలు ఇతను కనిపించలేదు. బాలీవుడ్ లో ఆఫర్లు రావడంతో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు వెళ్ళిపోయి, అక్కడే సినిమాలు చేస్తూ స్థిరపడిపోయారు.

తాజా సోనూసూద్ తెలుగులో విలన్ రోల్ చేయడానికి సై అన్నాడు. బెల్లంకొండ శ్రీనివాస్.. కాజల్ అగర్వాల్ జంటగా తేజ దర్శకత్వంలో రాబోతున్న ఓ సినిమాలో విలన్ గా సోనూసూద్ ను సెలెక్ట్ చేశారట. ఈ కథలో విలన్ గా సోనూసూద్‌ కరెక్టు గా సరిపోతాడని అతని సెలెక్ట్ చేశాడట తేజా. తేజ చెప్పిన కథ నచ్చడంతో.. సోనూసూద్ వెంటనే ఒప్పుకున్నాడని సమాచారం.