తొందరపడి ముందే కూసింది!

సినిమా ఇండస్ట్రీలో దర్శకులు తమ సినిమాల గురించి గొప్పలకు చెప్పిన దాఖలాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. ఒకరిద్దరు దర్శకులు ఆ విధంగా మాట్లాడినా.. చాలా వరకు అందరూ సినిమా మాట్లాడాలని సైలెంట్ గా ఉంటుంటారు. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అన్నట్లు వ్యవహరిస్తుంటారు. కానీ మంజుల ఘట్టమనేని మాత్రం దీనికి విరుద్ధంగా ప్రవర్తించి ఇప్పుడు బోరుమంటోంది. నటిగా, నిర్మాతగా పలు సినిమాలు చేసిన మంజుల ‘మనసుకు నచ్చింది’ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైంది.
అయితే సినిమా రిలీజ్ కు ముందుకు మామూలు గొప్పలకు పోలేదు. మా సినిమా అధ్బుతమని, సినిమా నచ్చని వాళ్ళు వేస్ట్ ఫెలోస్ అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడింది. అంతేనా సినిమా చూసిన కొందరు ప్రముఖులు తెగ పోగిడేసారని గొప్పలకు పోయింది. కానీ ఇప్పుడు సినిమా రిజల్ట్ తేడా కొట్టడంతో సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు రివర్స్ లో నెటిజన్లు ఆమెపై విరుచుకుపడడం మొదలుపెట్టారు. ఆమె చేసిన కామెంట్లు గుర్తు చేసి మరీ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఇకనైనా తొందర పడడం మంచిది కాదని గుర్తిస్తుందో లేదో చూడాలి!