‘తొలిప్రేమ’పై పాజిటివ్ బజ్!

ఈ వారంలో విడుదల కాబోతున్న మూడు చిత్రాల్లో వరుణ్ తేజ్ నటించిన ‘తొలిప్రేమ’పై
మంచి బజ్ క్రియేట్ అయింది. సినిమా ట్రైలర్లు, పోస్టర్లు ఆసక్తికరంగా ఉండడంతో ప్రతి ఒక్కరిని ఈ ప్రేమకథ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా యూత్ లో ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. దీనికి తగ్గట్లు సినిమాలో పాటలు చాలా ఫ్రెష్ ఫీలింగ్ ను కలిగించడంతో అంచనాలు మరింత పెరిగాయి. ఇన్సైడ్ టాక్ ను బట్టి సినిమా ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగిస్తుందని తెలుస్తోంది. అందుకే చిత్రబృందం కూడా సినిమా రిజల్ట్ పై చాలా నమ్మకంగా ఉన్నారు.

‘ఫిదా’ చిత్రంతో సక్సెస్ అందుకున్న వరుణ్ తేజ్ ఈ సినిమాలో లవర్ బాయ్ పాత్రలో కనిపించనున్నాడు. రాశిఖన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. కొత్త దర్శకుడు వెంకీ అట్లూరి ఈ సినిమా డైరెక్ట్ చేశారు. మరి సినిమా ఆశించిన విజయాన్ని అందుకుంటుందో లేదో చూడాలి!