‘తొలిప్రేమ’ డైరెక్టర్ నెక్స్ట్ ప్లాన్!

వరుణ్‌తేజ్‌, రాశీఖన్నా జంటగా నటించిన చిత్రం ‘తొలిప్రేమ’. ఈ చిత్రాన్ని వెంకీ అట్లూరి దర్శకత్వంలో బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మించారు. ఫిబ్రవరి 10న విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ నేపధ్యంలో ఆయన తదుపరి ఏ చిత్రం చేయబోతున్నారనే ఆసక్తి ఇండస్ట్రీలోనూ సినీ అభిమానుల్లోనూ ఏర్పడింది. అందుతున్న సమాచారం మేరకు వెంకీ అట్లూరి తదుపరి చిత్రం బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించనున్నారు. ఈ మేరకు దర్శకుడు స్క్రిప్టు రెడీ చేసుకుంటున్నారు. అది కూడా రొమాంటిక్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. శర్వానంద్ కోసం ఓ కథని రెడీ చేస్తున్నట్లు సమాచారం. అయితే అదే సమంయలో అల్లు అర్జున్ కు సైతం అదే కథని చెప్పబోతున్నట్లు తెలుస్తోంది.
దర్శకుడు మాట్లాడుతూ.. ”వెన్ హ్యారీ మెట్ సాలీ సినిమా చూసిన తర్వాత ఇష్టపడ్డాను. దాన్ని బట్టే మనకు తగ్గట్లు తొలి ప్రేమ కథను తయారు చేసుకుంటూ వచ్చాను. ఇదొక ఫిక్షన్‌ స్టోరీ. నా స్వీయానుభవం కాదు. నేను భారతి విద్యాభవన్‌లో చదువుకున్నాను. అక్కడ నా కంటే లేడి సీనియర్స్‌ను దీదీ అనే పిలిచేవాడిని. అబ్బాయిలనైతే భయ్యా! అని పిలిచేవాడిని అన్నారు. అలాగే నెక్ట్స్‌ మూవీ కూడా బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌గారి బ్యానర్‌లోనే ఉంటుంది. దిల్‌రాజుగారి బ్యానర్‌లో కూడా సినిమా త్వరలోనే ఉంటుంది” అని చెప్పారు.