త్రివిక్రమ్ కు అలాంటి సమస్యలు లేవట!

త్రివిక్రమ్ కు అలాంటి సమస్యలు లేవట!
తెలుగులో అగ్ర దర్శకులుగా వెలుగొందుతోన్న దర్శకుడు త్రివిక్రమ్. ఆయనతో కలిసి పని చేయాలని 
ప్రతి హీరో అనుకుంటాడు. ఆయన దర్శకత్వంలో పరిచయం కావాలని చాలా మంది యువ హీరోలు 
ప్రయత్నించారు. అలాంటి త్రివిక్రమ్ ఆర్థిక సమస్యల్లో ఇబ్బంది పడుతున్నారని గత కొంత కాలంగా 
వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి త్రివిక్రమ్ ప్రస్తుతం తన కొత్త ఇంటి నిర్మాణ పనుల్లో ఉన్నాడు. 
అయితే కొన్ని ఆర్థిక సమస్యల వలన ఆ ఇంటి నిర్మాణాన్ని మధ్యలోనే నిలిపివేశారని రకరకాల 
వార్తలు వినిపించాయి. కానీ ఆ వార్తల్లో నిజంలేదని తెలుస్తోంది. త్రివిక్రమ్ కు వాస్తుపై బాగా నమ్మకమట. దానికోసం ఆయన దగ్గరుండి మరీ పనులు చేయిస్తున్నాడు. దీని వలన ఆలస్యమవుతూ వస్తుంది. 
ఈ విషయాన్ని ఆయన సన్నిహితులు కొంతమంది తెలియజేశారు.