‘త్రీ ఇడియట్స్‌’ సీక్వెల్‌

2009లో విడుదలైన ‘త్రీ ఇడియట్స్‌’ అద్భుత విజయం సాధించింది. ఈ చిత్రంలో ‘ఆమిర్‌ ఖాన్‌, ఆర్‌. మాధవన్‌, శర్మన్‌ జోషి ప్రధాన పాత్రల్లో నటించారు. కరీనా కపూర్‌ కథానాయిక. రాజ్‌ కుమార్‌ హిరాణీ దర్శకుడు. వినోద్‌ చోప్రా ఫిల్మ్స్‌ సంస్థ నిర్మించింది. ముగ్గురు స్నేహితుల కాలేజీ రోజులను ఈ సినిమాలో చూపించారు. . కేవలం రూ.55 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన చిత్రం దాదాపు రూ.459 కోట్లు వసూలు చేసినట్లు విశ్లేషకులు చెప్పారు. ఆ తర్వాత ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో దర్శకుడు శంకర్‌ రీమేక్‌ చేశారు. ఇందులో విజయ్‌, శ్రీకాంత్‌, సత్యన్‌ నటించారు. ఇలియానా కథానాయిక. ‘ఇడియట్స్’ మరో సారి వెండితెరపై సందడి చేయడానికి వస్తున్నారు.

ఇప్పుడు ‘త్రీ ఇడియట్స్‌’ సీక్వెల్‌కు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు రాజ్‌ చెప్పారు. రచయిత జోషి స్క్రిప్టు పనులను కొన్ని రోజుల క్రితం ప్రారంభించినట్లు తెలిపారు. నెమ్మదిగా కథను సిద్ధం చేస్తున్నామని, తొందర పడటం లేదని అన్నారు. మరి ఈ సీక్వెల్‌లో ఎవరు హీరోగా కనిపించనున్నారో తెలియాలంటే వేచి చూడాలి.