త్వరలో ఏపీ మంత్రివర్గ విస్తరణ

ఏపీ మంత్రివర్గ విస్తరణ త్వరలో చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఈ మేరకు సచివాలయంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, సినీ నటుడు హరికృష్ణ మరణంతో విస్తరణ కొంచెం ఆలస్యమైందని ఆయన వివరించారు. సీపీఎస్‌ విధానం జాతీయ స్థాయిలో తీసుకున్న విధాన నిర్ణయమని ముఖ్యమంత్రి అన్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ సీపీఎస్‌ విధానం ఉందని, దీన్ని ఏవిధంగా పరిష్కరించాలో ఆలోచిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. డిసెంబర్‌ నాటికి హైకోర్టు భవనం పూర్తవుతుందని, హైకోర్టు ఏర్పాటు విషయంలో తాము స్పష్టంగా ఉన్నామని తెలిపారు.