త్వరలో సెట్స్ పైకి రాజమౌళి మల్టీస్టారర్!

రామ్‌చరణ్, ఎన్టీఆర్‌తో కలిసి ఎస్.ఎస్. రాజమౌళి ఓ భారీ మల్టీస్టారర్ మూవీ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ప్రి-ప్రొడక్షన్స్ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. ఈ చిత్రం షూటింగ్ సెప్టెంబర్‌లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాపై రకరకాల వార్తలు సోషల్ మీడియాలో షికార్లు చేస్తున్నాయి.

ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన కీర్తిసురేష్ నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే రామ్‌చరణ్‌కు జోడీగా పూజ హెగ్డే నటిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతానికి ఈ ఇద్దరు హీరోయిన్లు మంచి ఫామ్‌లో ఉండటం కూడా అది నిజమే అయివుండొచ్చని అనుకుంటున్నారు. అయితే ఈ చిత్రంలో పాత్రల గురించి గానీ, కథ గురించి గానీ చిత్ర యూనిట్‌ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. స్వాతంత్ర్య సమరం నాటి కథ ఆధారంగా రూపొందుతుందని చెబుతున్నారు.