త‌న పాత్ర‌కు డ‌బ్బింగ్ మొద‌లు పెట్టిన చిరు అల్లుడు

చిరు అల్లుడు క‌ళ్యాణ్ దేవ్ హీరోగా ఓ సినిమా రానున్న‌ట్లు మ‌న‌కు తెలిసిందే. నూత‌న ద‌ర్శకుడు రాకేష్ శ‌శి ద‌ర్శ‌క‌త్వంలో
తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఈ సినిమా కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో న‌డుస్తూనే క్రైమ్ త‌ర‌హా
కాన్సెప్ట్ కూడా ఈ క‌థ‌లో ఉంద‌ని స‌మాచారం.

ఈ చిత్రానికి సినీమాటోగ్రాఫ‌ర్‌గా కెకె సెంథిల్ కుమార్ ప‌ని చేయ‌డం విశేషం. క‌ళ్యాణ్ దేవ్ స‌ర‌స‌న మాళ‌విక శ‌ర్మ హీరోయిన్‌గా
న‌టిస్తోంది. ఈ చిత్రంలో త‌నికెళ్ళ భ‌ర‌ణి, ముర‌ళి శ‌ర్మ‌, నాజ‌ర్‌, స‌త్యం రాజేష్ వంటి న‌టులు కీల‌క పాత్రలో క‌నిపించనున్నారు.
హ‌ర్షవ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ సంగీతం స‌మ‌కురుస్తుండ‌గా, వారాహి చ‌ల‌న చిత్రం బ్యాన‌ర్ పై ఎంట‌ర్ టైన‌ర్‌గా రూపొంద‌నుంది.