దసరాకు వస్తున్న..’హలో గురు ప్రేమ కోసమే’

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ హీరోగా, అనుపమా పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నా చిత్రం ‘హలో గురు ప్రేమ కోసమే’. ఈ చిత్రాని దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్‌ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. నాని హీరోగా నేను లోకల్‌ సినిమాతో మంచి విజయం సాధించిన త్రానాథ్ రావు నక్కిన ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం మేజర్‌ షూటింగ్‌ పూర్తి చేసుకుంది.

తాజాగా ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను ప్రకటించారు చిత్రయూనిట్‌. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్‌ 18న రిలీజ్‌ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ చిత్రంలో విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. బెజవాడ ప్రసన్న కుమార్‌ మాటలు సమాకురుస్తున్నారు.