దెబ్బకు ట్విట్ట‌ర్‌ కు గుడ్ బై చెప్పింది!

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ప్రభావం జనాలపై బాగా చూపుతోంది. సెలబ్రిటీలు తమ అభిమానులతో ట్విట్ట‌ర్‌, ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా టచ్ లో ఉంటున్నారు. అయితే ఆ అభిమానం మితిమీరడం, ఎవరికి నచ్చినట్లు వారు కామెంట్లు చేస్తుండడంతో సమస్యలు ఎక్కువవుతున్నాయి. యాంకర్ అనసూయ కూడా ఇటువంటి సమస్యల్లోనే ఇరుక్కుంది. దెబ్బకు ట్విట్ట‌ర్‌ కు టాటా చెప్పేసి ఇప్పట్లో మళ్ళీ ఇప్పట్లో అకౌన్ రీఓపెన్ చేసే ఆలోచన లేదని స్పష్టం చేసింది. వెళ్ళిపోతూ.. ‘సోషల్ మీడియాలో జనాలకు హృదయం లేదు. వాళ్లకు బ్రేకింగ్ న్యూస్ లు కావాలి అంతే’ అంటూ కామెంట్ చేసింది.

గతంలో ‘అర్జున్ రెడ్డి’ సినిమా విషయంలో కామెంట్లు చేసి నెటిజన్లతో తిట్లు తిన్న అనసూయ రీసెంట్ గా తనతో ఫోటో దిగాలని ప్రయత్నించిన చిన్న పిల్లాడి ఫోన్ పగలగొట్టి వార్తల్లో నిలిచింది. ఈ వార్త కారణంగా ట్విట్ట‌ర్‌ లో జనాలు అనసూయపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. దీంతో ట్విట్ట‌ర్‌ నుండి తప్పుకుంది అనసూయ.