ధనుష్‌ ‘వడా చెన్నై’ టీజర్‌

తమిళ ప్రముఖ నటుడు ధనుష్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘వడా చెన్నై’. ఈ చిత్రాన్నికి విలక్షణ దర్శకుడు వెట్రి మారన్‌ దర్శకత్వ వహిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ సమర్పిస్తున్న ఈ చిత్రాని వండర్‌బార్‌ ఫిల్మ్స్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. ఐశ్వర్య రాజేశ్‌, ఆండ్రియా, సముద్రఖని, ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కాగా సంతోష్‌ నారాయణ్‌ బాణీలు అందిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. యాక్షన్‌ సన్నివేశాలతో ప్రచార చిత్రాన్ని చాలా ఆసక్తికరంగా రూపొందించారు. ఈ టీజర్‌ లో ”ఈ యుద్ద ఒకరి మృతితో ఆగిపోదు” అంటూ హీరో ధనుష్‌ చెబుతున్నారు. ధనుష్‌ కొత్త లుక్‌తో కనిపించారు. మొత్తం మూడు గెటప్స్‌లో ధనుష్‌ ఈ చిత్రంలో కనిపించనున్నాడు. ఈ టీజర్‌కు మంచి స్పందన లభించింది. ఈ టీజర్‌ ప్రస్తుతం ట్రెండింగ్‌ అవుతుంది. సెప్టెంబరులో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారట.