ధర్మాభాయ్ స్టోరీ ఏంటంటే..?

యంగ్ హీరో సాయి ధరం తేజ్, వినాయక్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘ఇంటెలిజెంట్’. అయితే ఈ సినిమాక ‘ధర్మాభాయ్’ అనే టైటిల్ ను పెట్టాలని సూచించాడు తేజు. కానీ వినాయక్ మాత్రం ‘ఇంటెలిజెంట్’ వైపే మొగ్గు చూపారు. అసలు సినిమాలో ‘ధర్మాభాయ్’ అనే పేరు ఎందుకు వచ్చిందో సాయి ధరం తేజ్ తన మాటల్లో వివరించారు.

‘వినాయక్ గారిని ధర్మాభాయ్ అనే పేరు ఎందుకు పెట్టారని అడగగా ఆయన నుండి ఆసక్తికర సమాధానం వచ్చింది. హీరోలకు ఒరిజినల్ పేర్లే పెట్టడం ఆయనకు ఇష్టమని అన్నారు. నాయక్ సినిమాలో చరణ్ కు చెర్రీ అని, ఖైదీనెంబర్ 150లో చిరంజీవి గారికి శంకర్ అని పెట్టేసారు. ఈ సినిమాలో నా ఒరిజినల్ పేరును ధరం తేజ్ నే ఉపయోహించారు. ఆ పేరు నుండే సినిమాలో కథకు తగ్గట్లు ధర్మాభాయ్ అనే పేరు వచ్చింది. అలానే సినిమాలో మైండ్ గేమ్ తరహా కొన్ని సన్నివేశాలు ఉంటాయి. దానికోసమే ఇంటెలిజెంట్ అనే టైటిల్ పెట్టారు’ అని వెల్లడించాడు తేజు.