నటి కంగనా పై కేసు

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌పై కేసు నమోదైంది. కంగన గత ఏడాది ముంబయిలోని పాలీహిల్‌లో రూ.20.07 కోట్లు పెట్టి ఓ ఇల్లు కొన్నారు. ఈ సమయంలో తనకు పడ్డ బాకీ చెల్లించలేదంటూ కంగన, ఆమె సోదరి రంగోలిపై ముంబయిలోని ఖర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ప్రకాశ్‌ జీ రోహిర అనే వ్యక్తి‌ ఫిర్యాదు చేశారు.

ఇల్లు కొనడానికి తాను మధ్యవర్తిగా వ్యవహరించానని, కానీ తనకు ఇవ్వాల్సిన మొత్తం సొమ్ము కంగన ఇవ్వలేదని ఆరోపించారు. మరోవైపు ఒప్పందం ప్రకారం 1% (రూ.20 లక్షలు) చెల్లించామని, కానీ ఇప్పుడు ఆయన 2% డిమాండ్‌ చేస్తున్నారని కంగన ప్రతినిధులు పేర్కొన్నారు. నగదు చెల్లించినట్లు రాసుకున్న పత్రాలు అన్ని తమ వద్ద ఉన్నాయని అన్నారు.