నటి వ్యాఖ్యలపై శ్రీరెడ్డి కౌంటర్

క్యాస్టింగ్ కౌచ్ అంశాన్ని తెరపైకి తెచ్చి సంచలనం క్రియేట్ చేసిన నటి శ్రీరెడ్డి విడతలుగా ఒక్కొక్కరిపై ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. శ్రీరెడ్డి తీరును తప్పు పట్టిన టాలీవుడ్‌లోని ప్రముఖ మహిళా నటిపై శ్రీరెడ్డి కౌంటర్‌ బాణాలు వదిలారు. టాలీవుడ్‌లో కొన్ని నెలల కిందట కలకలం రేపిన డ్రగ్స్‌ కేసు, చికాగో సెక్స్ రాకెట్ వంటి విషయాల గురించి ఆమె చేసిన సంచలన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఓ మహిళగా మీరంటే నాకు గౌరవం, అనవసర వ్యాఖ్యలు చేసి గౌరవాన్ని పోగొట్టుకోవద్దు. మీరు సినిమాలు తీశారు, నిర్మాతగా మీకు ప్రొడక్షన్స్ హౌసెస్ ఉన్నాయి. మీరు ఓ పెద్ద ఆర్టిస్ట్ కూతురు కాబట్టి మా సమస్య మీకు తెలియకపోవచ్చు. నా గురించి మర్యాద లేకుండా మాట్లాడితే నేను తట్టుకోలేను. మా సమస్యలు తెలుసుకోకుండా మాగురించి అమర్యాదగా మాట్లాడితే సహించేది లేదని, గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలని అన్నారు. కో ఆర్డినేటర్స్‌ సిస్టమ్ ఎంత దారుణంగా ఉందో మాకు తెలుసు. మహిళలను రొంపిలోకి ఎలా దింపుతారో మాకు తెలుసు. వాళ్లలోనే ముఖ్యంగా పింప్స్ ఉన్నారని అన్నారు. సినీ ఇండస్ట్రీకి నార్త్‌ ఇండియన్ అమ్మాయిలను పరిచయం చేసి, ఇంట్లో ఉంచుకున్న ఆ కల్చర్‌ తెచ్చింది మీరే అన్నారు. తెలుగు ఆర్టిస్టులను ఎంకరేజ్ చేయాలని కోరుతూ నటి శ్రీరెడ్డి ఓ వీడియో పోస్ట్ చేశారు.