“నన్నుదోచుకుందువటే” అంటున్న సుధీర్‌బాబు

యంగ్ హీరో సుధీర్‌బాబు మరో ఆసక్తికర చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే సమ్మోహనంతో ప్రేక్షకులను మురిపించిన సుధీర్‌బాబు ఆర్.ఎస్. నాయుడు దర్శకత్వంలో మరో చిత్రంలో చేస్తున్నాడు. ఈ చిత్రానికి “నన్ను దోచుకుందువటే” అనే టైటిల్ ఖరారు చేశారు. సీనియర్ ఎన్టీఆర్ నటించిన గులేభకావళి కథ సినిమాలోని ఎంతో
ప్రాముఖ్యం చెందిన పాటలోని పల్లవిని టైటిల్‌గా ఎంచుకున్నారు. ఆ పాట లాగే ఈ సినిమా కూడా అంతటి ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నారు.

సుధీర్‌ బాబు సరసన నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సుధీర్‌బాబు తన సొంత బ్యానర్‌పై తానే నిర్మిస్తున్నారు. ఈ నెల 14న టీజర్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.