‘నన్ను దోచుకుందువటే’ మూవీ టీజర్‌

యంగ్‌ హీరో సుధీర్‌బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ‘నన్ను దోచుకుందువటే’. ఈ చిత్రంలో సుధీర్‌బాబు సరసన కన్నడ నటి నభా నటేష్‌ నటించగా ఆర్‌.ఎస్‌. నాయుడు దర్శకత్వం వహించానున్నారు. సుధీర్‌బాబు ప్రొడక్షన్‌లో నిర్మిస్తున్న రెండో చిత్రం ఇది. కాగా (ఈ రోజు) శనివారం ఈ సినిమా టీజర్‌ ను చిత్ర బృందం విడుదలచేసింది.

ఈ టీజర్‌ ”ఆఫీసుకి రావాలంటే ప్రతిరోజూ భయంతో చచ్చిపోతున్నాం సార్‌. మరీ దారుణంగా సెక్యూరిటీతో గెంటించేస్తున్నారు” అనే డైలాగ్స్ తో టీజర్‌ ప్రారంభమౌతుంది. ‘సిరి నాకు ముందే నుంచే తెలుసా?’ అని సుధీర్‌బాబు వేణుని అడిగితే ‘మీరే కదా సార్‌ సిరిమ్మతో రోజు మాట్లాడతారు అని చెప్పడం’ ‘ఒరేయ్‌! ఇడియట్‌ అది ఐఫోన్‌లో ఉండే సిరిరా’ అని సుధీర్‌ కోపంగా అంటాడు. ఇందులో సుధీర్‌ బాబు ఓ కంపెనీ మేనేజర్‌ కార్తీక్‌ పాత్రలో కనిపించనున్నారు. ఆయనంటే ఆఫీసులో అందరికి టెర్రర్‌. ఇక హీరోయిన్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ సిరి అంటు పరిచయం చేసుకుంటూ.. కనిపిస్తుంది. ఇతర కీలక పాత్రల్లో నాజర్‌, వేణు నటిస్తున్న ఈ సినిమాకు అజనీష్‌ బి లోకనాథ్‌ సంగీతమందిస్తున్నారు. ఈ సినిమాను వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 13న రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.