నయనతార కొత్త చిత్రం!

వినూత్న కథాంశాలతో రూపొందుతున్న చిత్రాల్లో హీరోల సరసన నటిస్తూనే మరో వైపు కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కమర్షియల్ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తోంది అగ్రనాయిక నయనతార. ఆమె కథానాయికగా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో  ఓ హారర్ చిత్రం తెరకెక్కుతోంది. దాసు రామస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి డోర అనే టైటిల్‌ను ఖరారు చేశారు. షూటింగ్ తుది దశకు చేరుకుంది. తెలుగులో ఈ చిత్రాన్ని సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా పతాకంపై ప్రముఖ నిర్మాత మల్కాపురం శివకుమార్ తెరకెక్కిస్తున్నారు.  తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రానికి డోర అనే టైటిల్‌ను ఖరారు చేశారు.  ఈ సందర్భంగా నిర్మాత మల్కాపురం శివకుమార్ చిత్ర విశేషాలను తెలియజేస్తూ  ఇటీవల విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్.. టైటిల్ అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. నయనతార నటిస్తోన్న మరో మహిళా ప్రధాన చిత్రమిది.  ఇప్పటి వరకు వచ్చిన హారర్ చిత్రాలకు పూర్తి భిన్నంగా ఓ వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతోంది.  నయనతార పాత్ర చిత్రణ కొత్త పంథాలో వుంటుంది. ప్రతి సన్నివేశం అనూహ్యమైన మలుపులతో ఉత్కంఠభరింగా సాగుతుంది. మా సంస్థలో నవ్యతతో కూడిన వినూత్న కథా చిత్రాల్ని  రూపొందించాలనే ఉద్దేశ్యంతో ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నాను. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: దినేష్, సంగీతం: వివేక్, నిర్మాత: మల్కాపురం శివకుమార్.
CLICK HERE!! For the aha Latest Updates