నరేష్ బర్త్‌ డే సెలబ్రేషన్స్‌లో మహేష్ బాబు

ప్రిన్స్ మహేష్‌ బాబు 25వ చిత్రం షూటింగ్ ప్రస్తుతం డెహ్రాడూన్‌లో జరుగుతోంది. అల్లరి నరేష్‌ తన పుట్టిన రోజు వేడుకలు మహేష్ సినిమా సెట్‌లో జరుపుకున్నారు. ఈ సినిమాలో మహేష్‌తో పాటు తానూ నటిస్తున్న సంగతి తెలిసిందే. అల్లరి నరేష్‌కు మహేష్‌ & టీమ్‌ శుభాకాంక్షలు చెబుతూ కేక్ కట్‌చేసి వేడుక జరిపారు. ఈ వేడుకలో మహేష్‌ బాబు, పూజా హెగ్డే, వంశీ పైడిపల్లి సహా చిత్రబృందం పాలుపంచుకున్నారు. ఈ వేడుకలో వారంతా కలిసి దిగిన ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఇంకా టైటిల్‌ ఖరారు కాలేదు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్‌కు జంటగా పూజహెగ్డే నటిస్తోంది. అల్లరి నరేష్‌ ఈ చిత్రంలో ఓ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. డెహ్రడూన్‌లో అందమైన లొకేషన్స్‌లో షూటింగ్‌ జరుగుతున్న తరుణంలో యూనిట్‌ సభ్యులు నరేష్‌ పుట్టినరోజు వేడుకని అక్కడే నిర్వహించారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.