నవంబర్ నుంచి ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ రెగ్యులర్ షూటింగ్

దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా ఓ భారీ మల్టీ స్టారర్ రూపొందనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో పనులు బిజీగా ఉన్న ఈ సినిమా షూటింగ్ గురించి గతంలో రకరకాల వార్తలొచ్చాయి. తాజాగా అందుతున్నసమాచారం ప్రకారం నవంబర్ నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని తెలుస్తోంది. మొదటగా ఎన్టీఆర్, రామ్ చరణ్ ల సోలో సీన్స్ ను తెరకెక్కిస్తారట. ఇందుకోసం ఇప్పటీకే భారీ సెట్స్ ను రూపొందించే పనిలో చిత్రబృందం నిమగ్నమైందట.

విజయేంద్ర ప్రసాద్ సమకూర్చిన కథ కావడం, రాజమౌళి దర్శకత్వం వహిస్తుండడంతో ఈ మల్టీ స్టారర్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఎన్టీఆర్, త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేతలో నటిస్తుండగా అటు రామ్ చరణ్, బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. వీరిద్దరి ప్రాజెక్ట్స్ పూర్తయ్యాక ఎలాంటి ఆటంకాలు లేకుండా షూటింగ్ జరుగుతుందట. రాజమౌళి ఈ చిత్రాన్ని సాధారణ సినిమాలాగా తెరకెక్కించనున్నారు. ఆర్‌ ఆర్‌ ఆర్‌ అనే వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు