నాకు అలాంటి అలవాటు లేదు!

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది రకుల్ ప్రీత్ సింగ్. తెలుగులో ఆమె నటించిన ఆఖరి సినిమా ‘స్పైడర్’. దాని తరువాత ఇప్పటివరకు మరే సినిమాకు సైన్ చేయలేదు. ప్రస్తుతం ఆమె నటించిన ‘అయ్యారీ’ అనే బాలీవుడ్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటూ రకుల్ బిజీగా గడుపుతోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో భాగంగా రకుల్ మద్యం సేవించే విషయంపై క్లారిటీ ఇచ్చింది.
ఇండస్ట్రీలో మందు తాగడం అనేది చిన్న విషయమే అయినప్పటికీ తనకు మాత్రం అలాంటి అలవాటు లేదని స్పష్టం చేసింది రకుల్. అలానే తాను ఎవరితోనో ప్రేమలో ఉన్నట్లు వస్తోన్న వార్తలను కొట్టిపారేసింది. తనకు ఎవరితో ఎలాంటి ఎఫైర్ లేదని కరాఖండిగా చెప్పేసింది. జీవితం చాలా రొటీన్ గా మారిపోయి బోర్ కొడుతుందని ఏదైనా చాలెంజింగ్ లాంటిది కావాలని ఎదురుచూస్తోందట.