నాగార్జున నాని మూవీ టైటిల్‌ ఇదేనా!

టాలీవుడ్‌ అగ్ర నటుడు అక్కినేని నాగార్జున, నేచురల్‌ స్టార్‌ నాని కాంబినేషన్ లో ఓ మల్టీ స్టారర్ మూవీ వస్తున్న విషయం తెలిసిందే. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రంలో నాగార్జున మాఫియా డాన్ గా, నాని డాక్టర్ పాత్రలో సమాజ సేవ అంటే మక్కువ ఉన్న వ్యక్తిగా కనిపించనున్నాడు. తాజాగా ఈ సినిమా పై వినిపిస్తున్న సమాచారం ప్రకారం దేవదాసు అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

ఇందులో నాగార్జున పేరు దేవ్ కాగా, నాని పేరు దాసు అని తెలుస్తోంది. ఈ చిత్రంలో సన్నివేశానికి తగినట్లు వచ్చే కామెడీతో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ కూడా బాగానే ఉంటాయట.ఈ మూవీని వినాయక చవితికి రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఆకాంక్ష సింగ్, రష్మిక మందనలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం సమకూరుచగా వైజయంతీ మూవీస్ పై అశ్వనీ దత్ నిర్మిస్తున్నారు