నాగార్జున పుట్టిన రోజు వేడుకలు రద్దు


అక్కినేని నాగార్జునకు నందమూరి హరికృష్ణకు మధ్య మంచి అనుబంధం ఉంది. హరికృష్ణను నాగార్జున అన్న అని ఆప్యాయంగా పిలిచేవాడు. చాలా కాలమైంది.. త్వరలోనే ఒకసారి కలవాలి అని హరికృష్ణ చెప్పిన కొన్ని రోజులకే రోడ్డు ప్రమాదంలో ఈ రోజు ఉదయం మరణించడంతో నాగార్జున జీర్ణించుకోలేకపోయారు. ఈరోజు జరగాల్సిన తన పుట్టిన రోజు వేడుకల్ని రద్దు చేసుకుంటున్నట్టుగా ప్రకటించారు. ఇటీవలే నాగార్జున అభిమాని రవీందర్ రెడ్డి మృతి నుంచి బయటపడక ముందే ఆప్యాయ మిత్రుడు, సోదరసమానుడు నందమూరి హరికృష్ణ మరణించడంతో నాగార్జున మరింత తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యాడు.