నాగ్ సరసన శ్రద్ధా!

ఈ నెల 24న నాగార్జున, నాని మల్టీస్టారర్ సినిమా మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దర్శకుడు శ్రీరాం ఆదిత్య తెరకెక్కించనున్న ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్ గా రకుల్ ప్రీత్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. తాజాగా నాగార్జున కోసం హీరోయిన్ గా కన్నడ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ ను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. సినిమా ప్రారంభించేరోజున ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు. శ్రద్ధా శ్రీనాథ్ కు కన్నడలో మంచి క్రేజ్ ఉంది. యూటర్న్, విక్రమ్ వేద వంటి హిట్ చిత్రాల్లో నటించింది. గతేడాది మణిరత్నం రూపొందించిన ‘చెలియా’ సినిమాలో క్యామియో రోల్ చేసింది.
ఈ బ్యూటీ అయితే తన సినిమాకు సెట్ అవుతుందని భావించిన దర్శకుడు శ్రీరాం ఆమెను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సినిమాలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో నాగ్, శ్రద్ధాల మధ్య సన్నివేశాలు వస్తాయని సమాచారం. మార్చి నెల నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మణిశర్మ స్వరకర్త.