నాగ చైతన్య కోసం ఇద్దరు స్టార్‌ హీరోలు..!

అక్కినేని నట వారసుడు నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘శైలజా రెడ్డి అల్లుడు’. ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో అత్త శైలజా రెడ్డి పాత్రలో సినీయర్‌ నటి రమ్యకృష్ణ నటిస్తుండగా అను ఇమ్మాన్యూల్‌ నాగ చైతన్యకు జంటగా కనిపించనున్నారు. ముందుగా ఈ సినిమాను ఆగస్టు 31న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసినా అనివార్య కారణాల వల్ల సెప్టెంబర్ 13కు వాయిదా వేశారు.

అయితే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్రయూనిట్ భారీ ప్రీ రిలీజ్‌ వేడుకను నిర్వహించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. సెప్టెంబర్ ‌9న నిర్వహించనున్న ఈ వేడుకకు కింగ్‌ నాగార్జున, నేచురల్‌ స్టార్‌ నానిలు ముఖ్య అతిథిలుగా హాజరు కానున్నారు. ప్రస్తుతం నాగార్జున, నానిలు కలిసి ‘దేవదాస్’ అనే మల్టీస్టారర్లో నటిస్తున్నారు.