నాతో బిజినెస్ చేయాలనుకున్నాడు!

తమిళ హీరోయిన్ అమలాపాల్ తెలుగు సినిమాలలో కూడా నటించారు. అయితే టాలీవుడ్ లో ఆమెకు సరైన గుర్తింపు రాలేదు. ఇటీవల భర్తతో విడిపోయిన ఈ బ్యూటీ తరచూ ఏదోక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంది. ముందు కార్ కొన్నందుకు టాక్స్ కట్టకుండా ఉండటానికి ఆమె చేసిన పనుల వలన పోలీసులు కేసు నమోదు చేసారు. తాజాగా ఈ హాట్ బ్యూటీ తనను లైంగిక వేధింపులకు గురి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
అసలు విషయంలోకి వస్తే.. మలేషియాలో మహిళాభివృద్ధికి సంబంధించి ‘డాన్సింగ్ తమిలచ్చి’ కార్యక్రమంలో పాల్గొనే క్రమంలో టీనగర్ నృత్య పాఠశాలలో శిక్షణ తీసుకుంటున్నానని, అక్కడ పాఠశాల నిర్వాహకుడైన అళగేసన్ వేధింపులకు పాల్పడ్డాడని ఆమె కంప్లయింట్ లో పేర్కొంది. ఈ విషయంపై స్పందించిన పోలీసులు నిందితుడిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ఈ విషయంపై
అమలాపాల్ మాట్లాడుతూ.. ‘ఆయన నాతో వ్యాపారం చేయాలనుకున్నాడు. ఆయనకున్న గుర్తింపు, ఆయన చేసే పనులు చూసి నాకు చాలా భయమేసింది’ అంటూ వెల్లడించింది.