నానితో మరోసారి కీర్తి

నేచరల్‌ స్టార్‌ నాని ప్రస్తుతం నాగార్జునతో కలిసి మల్టీ స్టారర్‌ మూవీలో నటిస్తున్నారు. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది .ఈ మల్టీస్టారర్‌ తరువాత ఓ సినిమా లో నటించేందుకు అంగీకించాడు నాని. జెర్సీ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మళ్ళీరావా ఫేం గౌతమ్‌ తిన్ననూరి దర్శకుడు.

ఈ సినిమాలో నాని క్రికెటర్‌గా కనిపించనున్నాడు. 90లలో క్రికెటర్‌గా ఎదిగేందుకు ఓ యువకుడు పడిన కష్టాల నేపథ‍్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో నానికి జోడిగా కీర్తి సురేష్‌ను తీసుకునే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్‌. గతంలో నాని, కీర్తి సురేష్‌లు నేను లోకల్‌ సినిమాలో కలిసి నటించారు. ఇటీవల మహానటి సినిమాకు ఘనవిజయాన్ని అందుకున్న కీర్తి వరుసగా స్టార్‌ హీరోల సరసన నటిస్తూ బిజీగా ఉన్నారు. మరి ఇంత బిజీలో నాని సినిమాకు డేట్స్ అడ్జెస్ట్ చేస్తారో లేదో చూడాలి.