నాని ‘అ!’ ఎలా ఉండబోతుందంటే..?

యంగ్ హీరో నాని నిర్మాతగా మారి రూపొందించిన చిత్రం ‘అ!’. కాజల్, రెజీనా, నిత్యామీనన్, అవసరాల శ్రీనివాస్ వంటి తారలు నటించిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో నాని చేప క్యారెక్టర్ కు, రవితేజ ఒక మొక్క క్యారెక్టర్ కు వాయిస్ ఓవర్ అందిస్తున్నారు. అయితే సినిమా ఎలా ఉండబోతుందనే విషయంపై కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సినిమా మొత్తం కూడా ఒక స్టార్ హోటల్ బ్యాక్ డ్రాప్ లో జరగనుంది. దానికోసమే రెస్టారంట్ సెట్, కిచెన్ సెట్ వేసినట్లు తెలుస్తోంది. వంట సరిగ్గా రాకుండానే ఒక కుర్రాడు స్టార్ హోటల్ లో చెఫ్ గా జాయిన్ అవుతాడు.

యూట్యూబ్ లో వీడియోలు చూస్తూ వంట చేయడానికి ఇబ్బంది పడే ఆ యువకుడికి పక్కనే ఎక్వేరియంలో ఉండే చేప సహాయం చేస్తుందట. చాలా రోజులుగా అక్వేరియంలోనే ఉంటూ చెఫ్ లు చేసే వంటలు చూడడంతో చేపకు వంట మీద నాలెడ్జ్ వస్తుందన్నమాట. ఆ చేపను ఆటపట్టిస్తూ పక్కనే ఉన్న మొక్క కామెంట్లు చేస్తూ ఉంటుందట. ఆ హోటల్ కు వచ్చే క్యారెక్టర్లు వాటి మధ్య జరిగే కీలక సంఘటనలను కలిపి ఈ సినిమాను తెరకెక్కించారు. డిఫరెంట్ లైన్ తో ఉన్న ఈ సినిమాను తెరపై ఎలా ప్రెజంట్ చేసారో చూడాలంటే కొద్దిరొజులు ఆగాల్సిందే!