నాని కొత్త సినిమా టైటిల్!

మీడియం రేంజ్ హీరోగా నిర్మాతలకు లాభాల పంట పండిస్తున్నాడు హీరో నాని. ఈ మధ్యకాలంలో నాని నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ బాటలో నడుస్తున్నాయి. దీంతో నానితో సినిమా చేయడానికి దర్శకనిర్మాతలు పోటీ పడుతున్నారు. ఇదే జోరును కొనసాగిస్తున్నాడు ఈ నేచురల్ స్టార్. ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో రెండు, మూడు సినిమాలు సెట్ చేసేసుకుంటున్నాడు. ప్రస్తుతం ‘నిన్ను కోరి’ సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమా జూన్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా నాని, హనురాఘవపూడి చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో వీరిద్దరు కలిసి చేసిన ‘కృష్ణగాడి వీరప్రేమ గాధ’ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
 
హనుకి కూడా దర్శకుడిగా బ్రేక్ వచ్చిన సినిమా అది. దీంతో మరోసారి వీరిద్దరు కలిసి సినిమా చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి ‘అదివో అల్లదివో శ్రీహరి వాసమూ’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. తిరుపతి నేపధ్యంలో సాగే ప్రేమకథ కావడంతో ఈ టైటిల్ ను ఖరారు చేసే అవకాశం ఉందని అంటున్నారు. టైటిల్ అయితే ఆకట్టుకునే విధంగా ఉంది మరి కథ, కథనాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. ప్రస్తుతం హను, నితిన్ తో ఓ సినిమా చేస్తున్నాడు. అది పూర్తయిన తరువాత నాని, హనుల సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.