నాని డైరెక్టర్ తో కళ్యాణ్ రామ్!

నందమూరి కళ్యాణ్‌రామ్‌ హీరోగా, ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ త్వరలో ఒక చిత్రాన్ని ప్రారంభించనుంది. ప్రముఖ నిర్మాత “జెమినీ” కిరణ్ నిర్మించనున్న ఈ చిత్రానికి “ఉయ్యాలా జంపాల, మజ్ను” ఫేమ్ విరించి వర్మ దర్శకత్వం వహిస్తారు.ఈ సంవత్సరం ద్వితీయ భాగం లో ఈ చిత్రం సెట్స్ మీద కు వెళ్తుంది అని నిర్మాణ సంస్థ తెలిపింది. “ఉగాది పర్వదినాన నందమూరి కళ్యాణ్ రామ్ హీరో గా, విరించి వర్మ దర్శకత్వం లో మా ప్రొడక్షన్ No. 15 ను అనౌన్స్ చేస్తున్నాము. ఈ సంవత్సరం ద్వితీయ భాగం లో ఈ చిత్రం ప్రారంభం అవుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు త్వరలో తెలుపుతాము. చక్కటి కుటుంబ నేపధ్యం ఉన్న కథ ను విరించి వర్మ సిద్ధం చేసుకున్నాడు ” అని నిర్మాత “జెమినీ” కిరణ్ గారు తెలిపారు. ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేయబడతాయి.