నాని హోస్టింగ్‌ పై తారక్ కామేంట్స్‌

తారక్‌ ప్రస్తుతం ‘సెలెక్ట్’ మొబైల్‌ సంస్థకు అంబాసిడర్‌ గా ఎంపికైనా సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బ్రాండ్ ప్రమోట్ చేస్తూ శుక్రవారం హైదరాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.’ మొబైల్‌ స్టోర్స్ నన్ను బాగా ఆకట్టుకున్నాయి. అందుకే వీటిలో భాగం అయ్యాను. నా మొదటి ఫోన్‌ జగదీష్‌ మార్కెట్లో కొన్నాను. ఇప్పటికి ఫోన్‌లో గేమ్‌లే ఎక్కువగా ఆడుతుంటాను. మొదట్లో ఐ ఫోన్‌ ఎలా వాడాలో అర్థం అయ్యేది కాదు. కానీ మా అబ్బాయి అభయ్‌రామ్‌ ఇప్పుడే నా ఐఫోన్‌నే కాక వాడి నానమ్మ ఐఫోన్‌ కూడా వాడుతున్నాడు. అయితే అభయ్‌కు ఫోన్‌ను మాత్రం గిఫ్ట్‌గా ఇవ్వను అన్నాడు.

ఇక బిగ్‌బాస్‌ షో గురించి అడిగిన ప్రశ్నసు సమాధానంగా.. నాని షోను బాగా రక్తి కట్టిస్తున్నాడు. ప్రతివారం అతను చెప్పే పట్ట కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. మొదట చెప్పినట్లుగానే మరికాస్త మసాలా యాడ్‌ చేస్తూ తనదైన శైలిలో అదరగొడుతున్నాడు అంటూ నానిపై ప్రశంసలు కురిపించాడు ఎన్టీఆర్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here