నా కోసం ఎవరూ ఫ్రీ గా చేయలేదు: నాని!

యంగ్ హీరో నాని నిర్మాతగా మారి ‘అ!’ సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. రేపే ఈ సినిమా
ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో నిత్యామీనన్, కాజల్, రెజీనా, అవసరాల
శ్రీనివాస్ వంటి స్టార్ నటీనటులు ఉన్నారు. నాని కోసం వీరంతా తమ రెమ్యూనరేషన్ ను తగ్గించుకొని
సినిమా చేశారని, కొండరేమో అసలు రెమ్యూనరేషన్ కూడా అడగలేదని వార్తలు వినిపించాయి.
తాజాగా ఈ విషయంపై స్పందించిన నాని తనకు ఎవరూ ఎలాంటి డిస్కౌంట్లు ఇవ్వలేదని స్పష్టం
చేశాడు. నిర్మాతగా నేను, నటీనటులుగా వాళ్ళు ముందే ఆలోచించుకున్నాం.
సాధారణంగా వాళ్ళు ఒక సినిమా కోసం నలభై, యాభై కాల్షీట్లు ఇస్తారు. దానిప్రకారం వాళ్ళకు రెమ్యూనరేషన్ ఇస్తారు. నా సినిమాకు అన్ని కాల్షీట్లు అవసరం లేదు. నాకు ఇచ్చిన కాల్షీట్ల ప్రకారం నేను రెమ్యూనరేషన్ ఇచ్చాను. అంతేకాని నాకు ఎలాంటి డిస్కౌంట్లు  ఇవ్వలేదని క్లారిటీ ఇచ్చేశాడు. సినిమా పూర్తయిన తరువాత కొనడానికి కొందరు ముందుకు వచ్చినా.. రిస్క్ తీసుకోవాలని నేనే సొంతంగా విడుదల చేస్తున్నానాని వెల్లడించాడు.