‘నా నువ్వే’ మూవీ రివ్యూ

Critics METER

Average Critics Rating: 2
Total Critics:3

AUDIENCE METER

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...
movie-poster
Release Date
June 14, 2018

Critic Reviews for The Boxtrolls

పూర్తి క్లాస్ సినిమా "నా నువ్వే"
Rating: 2.5/5

https://www.klapboardpost.com

నా నువ్వే.. సోల్ లెస్ లవ్ స్టోరీ
Rating: 1.75/5

http://www.tupaki.com

`విధి` వైప‌రీత్యం
Rating: 2.25/5

https://www.telugu360.com

చిత్రం : ‘నా నువ్వే’
నటీనటులు : కల్యాణ్‌ రామ్‌, తమన్నా, వెన్నెల కిషోర్‌, తనికెళ్ల భరణి తదితరులు
సంగీతం : శరత్‌ వాసుదేవన్‌
నిర్మాతలు : కిరణ్‌ ముప్పవరపు, విజయ్‌కుమార్‌ వట్టికూటి
దర్శకత్వం : జయేంద్ర
విడుదల తేదీ : 14-06-2018
రేటింగ్ : 2.5/5

కల్యాణ్‌ రామ్‌ తన లుక్‌ మార్చుకొని ఎమ్మెల్యే మూవీలో కొత్తగా కనిపించాడు. మాస్‌ నుంచి బయటపడే ప్రయత్నం చేసిన కళ్యాణ్‌ రామ్‌కు ఎమ్మెల్యే మంచి సపోర్ట్‌ చేసింది. మాస్‌తో పాటు కొద్దిగా క్లాస్‌ టచ్‌ కూడా ఇచ్చాడు ఈ చిత్రంలో. ఈ సినిమా విజయవంతం కావడంతో ఇప్పుడు మరో కొత్త ప్రయత్నంగా పూర్తి లవ్‌ ఫీల్‌ టచ్‌ ఉన్న ‘నా నువ్వే’ తో మన ముందుకు వచ్చాడు. మోర్‌ లవ్‌…మోర్‌ మేజిక్‌ అనే ఉపశీర్షికతో తెరకెక్కిన ఈ చిత్రానికి ఛాయాగ్రహకుడు పి.సి శ్రీరామ్‌ కావడం..కల్యాణ్‌ రామ్‌ కొత్త లుక్‌లో కనిపించడం వంటి విషయాలు విడుదలకి ముందే ఆసక్తిని రేకెత్తించాయి. మరి లవ్‌ స్టోరి ఎంత వరకు మ్యాజిక్‌ చేసిందో తెలుసుకుందాం.

కథ : ఈ సినిమాలో వరుణ్‌ (కల్యాణ్‌ రామ్‌) ఉద్యోగం కోసం అమెరికా వెళ్లే ప్రయత్నాల్లో ఉంటాడు. రెండుసార్లు అమెరికా వెళ్లాలన్న ప్రయత్నం చేసినా వీలుకాదు. మూడోసారి కచ్చితంగా అమెరికా వెళ్తాననే నమ్మకంతో ఉంటాడు. విధిరాతని పెద్దగా నమ్మని వరుణ్‌కు రేడియో జాకీ మీరా (తమన్నా) కలుస్తుంది. వరుణ్‌ లక్కీ ఛార్మ్‌ అని భావిస్తుంది. విధి ఇద్దరినీ కలిపిందని నమ్మే మీరా..వరుణ్‌ ప్రేమలో మునిగిపోతుంది. మరి విధిని నమ్మని వరుణ్‌.. మీరాని ప్రేమించాడా? వాళ్లిద్దరి ప్రేమకథని విధి ఎన్ని మలుపు తిప్పిందో తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే.

నటీనటులు : కల్యాణ్‌ రామ్‌ కొత్త లుక్‌ బాగుంది. ఇప్పటి వరకు మాస్, యాక్షన్ రోల్స్‌లో కనిపించిన కల్యాణ్ రామ్ సాఫ్ట్, స్టైలిష్‌ లుక్‌లో మెప్పించారు. తొలిసారి పూర్తి స్థాయి రొమాంటిక్‌ కథలో నంటించినప్పటికీ ఆయన మంచి పనితీరును కనబరిచాడు. తమన్నాకు, కల్యాణ్‌ రామ్‌కు మధ్య అక్కడక్కడా మంచి కెమిస్ర్టీనే పండింది. తమన్నా ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలిచింది. ఆమె అందం, నటన, హావభావాల పరంగా కుర్రకారును బాగా ఆకట్టుకుంటుంది. ఎమోషనల్‌ సన్నివేశాల్లోనూ తమన్నా బాగా పండించింది. మిగిలిన పాత్రల్లో వెన్నెల కిషోర్‌, ప్రవీణ్‌, తనికెళ్ల భరణి, సురేఖావాణి, పోసాని చిన్నచిన్న పాత్రల్లో కనిపించి వాళ్ల పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా సినిమాకు మంచి మార్కులు పడతాయి. పీసీ శ్రీరామ్‌ కెమెరా మాయాజాలం పాటల్లో చాలా బాగా కనిపిస్తుంది. ప్రతి ఫ్రేమ్‌ని అందంగా చూపించారు. శరత్‌ వాసుదేవన్‌ సంగీతం బాగుంది. రచన, దర్శకత్వ పరంగానే చిన్న చిన్న లోపాలు కనిపిస్తున్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. కథకి ఏం కావాలో అవన్నీ పక్కాగా సమకుర్చారు.

విశ్లేషణ : విధి చుట్టూ అల్లుకున్న చిత్రం ఇది. చాలా సినిమాల్లో విధి అనే విషయాన్ని ఒకట్రెండు చోట్ల వాడుతూ అందులోని మేజిక్‌ని చూపించే ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఇక్కడ మాత్రం కథ మొత్తాన్ని విధి చూట్టూనే తిప్పారు. కొన్ని చోట్ల విధికే పరీక్ష పెట్టారు. దాంతో విధి అనే విషయం అసలు మేజిక్‌ కనుమరుగైపోయి, సన్నివేశాలు సాధారణంగా మారిపోయాయి. ప్రేమకథలోనూ కొత్తదనం లేదు. దాంతో సినిమాని ఆద్యంతం ఓపికగా చూడాల్సిన పరిస్థితి. వరుణ్‌ తన జీవితంలోకి వచ్చిన విషయాన్ని…విధి అతన్ని కలిపిన వైనాన్నిమీరా రేడియోలో తన ప్లాష్‌బ్యాక్‌గా చెప్పడంతో ఈ కథ మొదలవుతుంది. విధిని నమ్మే మీరా..విధిని నమ్మని వరుణ్‌…ఎలాంటి పరిస్థితుల్లో కలుసుకున్నారనే అంశాలతో తొలి భాగం కథ సాగుతుంది.

విడిపోయిన హీరో హీరోయిన్లను కలిపే అంశంలో క్యూరియాసిటీ క్రియేట్ చేసినా ప్రేక్షకుడు కథలో లీనమయ్యే ఎమోషన్స్ మిస్ అయినట్టు కనిపిస్తుంది. దర్శకుడు అనుకున్న స్థాయిలో అలరించలేదనిపిస్తుంది. వెన్నెల కిషోర్‌, ప్రియదర్శి ఇతర నటులు చేసే కామెడీ అంతంత మాత్రమే. రెండో భాగంలోనే కొన్నిమలుపులు చోటు చేసుకుంటాయి. కానీ, అవి కూడా ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టుగానే అనిపిస్తాయి. అయితే తొలి సగభాగంతో పోలిస్తే రెండో భాగం కాస్త పర్వాలేదనిపిస్తుంది. ఒక పక్క పీసీ శ్రీరామ్‌ అందమైన ఫ్రేమ్‌.. అందులో కల్యాణ్‌ రామ్‌, తమన్నా వంటి అందమైన జంట కనిపిస్తున్నప్పటికీ ప్రేమకథలకి కావాల్సిన మేజిక్‌, కెమిస్ర్టీ ఎక్కడా కనిపించలేదని పిస్తోంది. రాసుకున్న సన్నివేశాల్లోనే ఫీల్‌ లేనప్పుడు సినిమాకి ఎన్ని హంగులు జోడించినా వృథానే అనే విషయం ఈ చిత్రంతో అర్థమవుతంది. యాడ్‌ ఫిల్మ్స్‌ తీయడంలో పట్టున్న జయేంద్ర ఇలాంటి చిన్న కథతో, అంతే పరిమితుల్లోనే సన్నివేశాలు రాసుకొని ఈ చిత్రాన్ని తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది.

హైలైట్స్
కల్యాణ్‌రామ్ లుక్
త‌మ‌న్నా న‌ట‌న, అందం
నేపథ్య సంగీతం

డ్రాబ్యాక్స్
కథలో ఎమోషన్స్ లేకపోవడం
కామెడీపై దృష్టి పెట్టకపోవడం

చివ‌రిగా: పూర్తి క్లాస్ సినిమా “నా నువ్వే”
(గమనిక: ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here