నా పర్సనల్ విషయాలు అస్సలు చెప్పను!

టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఉన్నప్పుడు ఎలాంటి విమర్శలు చేయని గోవాబ్యూటీ ఇలియానా బాలీవుడ్‌కు మూటా ముల్లె సర్దుకుని వెళ్లిపోయాక మాత్రం దక్షిణాది చిత్రపరిశ్రమపై విమర్శలు గుప్పించడం మొదలు పెట్టింది. మీడియాపైనా విరుచుకుపడటం ఈ అమ్మడికి అలవాటే. సంచలనాలు చేసే వాళ్లలో ఇలియానా ఒకటన్నది తెలిసిందే. ఇప్పుడు బాలీవుడ్ కూడా ఈ భామను పట్టించుకోకపోవడంతో మళ్లీ దక్షిణాదిపై దృష్టి పెట్టింది. అలా ఓ తెలుగు చిత్రంలో అవకాశం దక్కించుకుంది. తమిళ చిత్రం రీమేక్‌లో రవితేజ పక్కన నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ఈ భామ ఆస్ట్రేలియాకు చెందిన ఆండ్రూ నిపోన్‌తో ప్రేమ కలాపాలు సాగిస్తోందని వార్తలు షికార్లు చేస్తున్నాయి. దీనికి కారణం వీళ్లిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తెగ షికార్లు చేయడమే.

ఇలియానా తన బాయ్ ఫ్రెండ్‌ను రహస్యంగా పెళ్లి చేసుకుందని కూడా సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై ఇలియానా మండిపడిపోతుందట. ప్రేమ, పెళ్లి నా వ్యక్తిగతం. నా పర్సనల్‌ విషయం గురించి మీడియాకు ఎందుకు అని చిరాకు పడిపోతుందట. పెళ్లయితే అక్క, వదిన పాత్రలే వస్తాయి కదా అని చూస్తున్నారా అంటూ ఊగిపోతుందట. నేను ఇంకా చాలాకాలం హీరోయిన్‌గానే నటిస్తాను అంటోందట. నా ప్రేమ గురించి ఇప్పటి వరకూ ఎక్కడా చెప్పలేదు, చెప్పను కూడా.. నా పర్సనల్ విషయాల గురించి చెప్పడానికి నాకు ఇష్టం లేదు అని తెగేసి చెబుతుందట ఈ ఇల్లీ బేబీ. అలాంటప్పుడు బోయ్‌ఫ్రెండ్‌తో క్లోజ్‌గా ఉండే ఫొటోలు తరచూ ఇంటర్నెట్‌లో పెట్టడమెందుకని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.