నిఖిల్ ముద్ర ఫస్ట్‌లుక్

టీఎన్‌ సంతోష్‌ దర్శకత్వంలో హీరో నిఖిల్‌ ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నిఖిల్‌ జర్నలిస్టు లెనిన్‌ సురవరంగా కనిపించనున్నారంటూ ఇటీవల చిత్ర బృందం ఫ్రీలుక్‌ను విడుదల చేసింది. కాగా నిఖిల్‌ పుట్టినరోజు సందర్భంగా మూవీ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇందులో నిఖిల్‌ చేతిలో కెమెరా పట్టుకుని, ఆసక్తిగా కనిపిస్తున్నాడు. ఆయన చుట్టూ స్క్రీన్లపై వివిధ ఛానెళ్లను చూపించారు. ఈ చిత్రానికి ముద్ర అనే టైటిల్‌ ఖరారు చేశారు.

ఈ చిత్రంలో నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి నటిస్తోంది. రాజ్‌ కుమార్‌ ఆకెళ్ల, కావ్య వేణుగోపాల్‌ నిర్మాతలు, సామ్‌ సీఎస్‌ పాటలు రాస్తున్నారు. సూర్య సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కిర్రాక్‌ పార్టీ అంటూ ప్రేక్షకులను అలరించిన యంగ్ హీరో నిఖిల్ సినిమా ఆశించినంత స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఈ సినిమా కన్నడ “కిరిక్‌ పార్టీ”కి తెలుగు రీమేక్, ఈ చిత్రానికి శరణ్‌ కొప్పిశెట్టి దర్శకుడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మించింది. ఇప్పుడు నిఖిల్ తన 16వ సినిమా ముద్రపై దృష్టిసారించాడు. ఈ చిత్రం తమిళంలో విజయం సాధించిన “కనితన్” మూవీకి తెలుగు రీమేక్. ఈ సినిమాను ఆరా సినిమాస్, మూవీ డైనమిక్స్, ఎల్ఎల్‌పీ పతాకాలపై కావ్య, వేణుగోపాల్, రాజ్‌కుమార్ నిర్మిస్తున్నారు.