నిర్మాతను డైరెక్ట్ చేస్తాడట!

నాని నిర్మాతగా భారీ స్టార్ కాస్ట్ తో వచ్చిన సినిమా అ!. కొత్తదనం కోరుకునే తెలుగు ప్రేక్షకులకు అ! చూసి అదిరిపోయింది అనేశారు. కొత్త దర్శకుడే అయినా ప్రశాంత్ వర్మ తన టాలెంట్ ఏంటో చూపించాడు. ఇక ఈ సినిమా తర్వాత నానితో మరో ప్రయోగాత్మక సినిమా చేస్తున్నాడట ప్రశాంత్ వర్మ. ఇది కూడా ఓ డిఫరెంట్ సబ్జెక్ట్ అని అంటున్నారు. నాని రేంజ్ పెంచేలా ఈ సినిమా ఉంటుందట.
నిర్మాతగా నానిని మెప్పించిన ప్రశాంత్ వర్మ హీరోగా నానిని కచ్చితంగా మెప్పిస్తాడని అంటున్నారు. వరుస విజయాలతో దూసుకెళ్తున్న నాని ప్రస్తుతం కృష్ణార్జున యుద్ధం సినిమా చేస్తున్నాడు. మేర్లపాక గాంధి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, రుస్కార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.