నిర్మాతలకు ఇబ్బందిగా మారిన మెగాహీరో!

అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’ చిత్రంతో సక్సెస్ అందుకొని అదే దూకుడుతో ‘ఒక్క క్షణం’ సినిమాలో
నటించాడు. ఈ సినిమాకు ఏవరేజ్ టాక్ వచ్చింది. అయితే ఈ మధ్య కాలంలో ఈ హీరోపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. అతడు నటించిన మలయాళ సినిమా ‘యుద్ధభూమి’ పేరుతో తెలుగులో రిలీజ్ చేస్తున్నందుకు అతడికి రూ.15 లక్షలు ఇవ్వాల్సిందేనని సీనియర్ ప్రొడ్యూసర్ ఎన్వీ ప్రసాద్ పై ఫైర్ అయ్యాడు. అంతేనా చిరంజీవి గారి దగ్గర పంచాయితీ పెడతానని బెదిరించాడట. ఈ విషయం పక్కన పెడితే తాజాగా మరో పది లక్షల కోసం నిర్మాతను విసిగిస్తున్నాడని సమాచారం.
శిరీష్ నటించిన ‘ఒక్క క్షణం’ సినిమా అనుకున్న ఫలితాన్ని రాబట్టలేకపోయింది. దీంతో బయ్యర్లు నష్టపోయారు. నిర్మాతకు కూడా నష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం కోటి రూపాయలు రెమ్యూనరేషన్ మాట్లాడుకున్నాడు శిరీష్. అయితే పదిలక్షలు ఇంకా చెల్లించలేదని నిర్మాత పీకలపై కూర్చున్నాడట. నష్టపోయింది బయ్యర్లు కానీ నిర్మాత కాదు కదా అనేది అతడి వాదన. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో అవకాశాలు సంపాదించుకుంటున్న క్రమంలో శిరీష్ తన ప్రవర్తనతో నిర్మాతలకు ఇబ్బందిగా మారాడని అంటున్నారు.