‘నీది నాది ఒకే కథ’పై ధనుష్ కన్ను!

శ్రీవిష్ణు హీరోగా నటించిన చిత్రం ‘నీదీ నాదీ ఒకే కథ’. వేణు వూడుగుల దర్శకత్వం వహించారు. సత్నా టిటస్‌ కథానాయిక పాత్ర పోషించారు. ఆరాన్‌ మీడియా వర్క్స్‌, శ్రీ వైష్ణవి క్రియేషన్స్‌ పతాకాలపై ప్రశాంతి, కృష్ణ విజయ్‌ చిత్రాన్ని నిర్మించారు. సురేష్‌ బొబ్బిలి స్వరాలు సమకూర్చారు. ఈ నెల 23న విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌ తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో సినిమా రీమేక్‌కు మంచి డిమాండ్‌ ఏర్పడినట్లు తెలుస్తోంది.తమిళ రీమేక్‌ హక్కులను రజనీతో కబాలి వంటి భారీ చిత్రం నిర్మించిన ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్‌ థను భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు సమాచారం. కాగా ఈ రీమేక్‌లో హీరో ధనుష్‌ నటించే అవకాశాలు ఉన్నట్లు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. అయితే దీనికి సంబంధించి చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ధనుష్‌ గత ఏడాది ‘వీఐపీ 2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దీని తర్వాత ఆయన ‘వడ చెన్నై’, ‘మారి 2’ చిత్రాల్లో నటిస్తున్నారు. అదేవిధంగా ‘ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్‌ ది ఫకీర్‌’ అనే హాలీవుడ్‌ చిత్రంలోనూ నటిస్తున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates