“నీవెవరో” మూవీ టీజర్‌

ఆది పినిశెట్టి, తాప్సి, రితికా సింగ్‌ కలిసి నటిస్తున్న చిత్రం “నీవెవరో” ఈ చిత్రాన్నికి హరినాథ్‌ దర్శకత్వం వహించగా కోన ఫిలిమ్‌ కార్పొరేషన్‌, ఎం.వి.వి. సినిమా పతాకాలపై కోన వెంకట్‌, ఎం.వి.వి సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ ను ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ఇటీవల విడుదల చేశారు. కాగా టీజర్‌ను ఆదివార యూట్యూబ్‌లో విడుదల చేశారు. సెస్పెన్స్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ఈ టీజర్‌ను చేస్తే తెలుస్తోంది.

ఈ టీజర్‌ ప్రారంభంలో ‘మూడు నగరాలు..రెండు ప్రేమకథలు.. ఒక్క సంఘటన’ అనే ఆది పినిశెట్టి డైలాగ్‌తో మొదలౌతుంది. ‘ఇది ప్రమాదం కాదు సర్‌.. ఇది హత్య’ అంటూ ఓ మహళ పోలీసులకు చెబుతుంది. ‘ఈ ప్రపంచంలో ప్రతి సమస్యకు సమాధానం ఏదో ఒక రూపంలో వస్తుంది. నాకు ఏ రూపంలో వస్తుందో చూడాలి’ అంటూ పినిశెట్టి తీవ్రంగా ఆలోచిస్తున్నారు. వీడ్ని స్కెచ్‌ వేసి చంపింది అమెరికా ప్రెసిడెంట్‌ డొనాల్డ్‌ ట్రంప్‌, నార్త్‌ కొరియా ప్రెసిడెంట్‌ కిమ్‌. కిమ్‌ అయినా..ట్రంప్‌ అయినా లోపలేసి కుమ్ముతా’ అంటూ తనలోని హీరోయిజాన్ని వెన్నెల కిషోర్‌ చెప్పే తీరు నవ్వులు పూయిస్తుంది.