నువ్వే హీరో అని శ్రీదేవిని ఒప్పించా

యండమూరి వీరేంద్రనాథ్ తెలుగు నవలా లోకంలో ఆయన పేరు తెలియనివారుండరు. రచయితగా పేరు ప్రఖ్యాతలు గడించిన యండమూరి శ్రీదేవి మరణ వార్త విని ఆమెతో తనకున్న సాన్నిహిత్యాన్ని పంచుకున్నారు. శ్రీదేవిని ఒక సినిమా కోసం ఒప్పించడానికి సినిమాకు నువ్వే హీరో అని చెప్పి ఆమెను ఒప్పించానని గుర్తుచేసుకున్నారు. నాగార్జునతో కలిసి ‘ఆఖరి పోరాటం’ సినిమాలో నటించడానికి మొదట శ్రీదేవి ఇబ్బంది పడిందట.
నాగేశ్వరావు గారితో కలిసి నటించాను.. ఇప్పుడు వారబ్బాయితో కలిసి నటిస్తే ప్రేక్షకులు ఆదరిస్తారా..? అనే సందేహాన్ని వ్యక్తం చేసిందట. దానికి యండమూరి ఈ సినిమాకు నువ్వే హీరో.. నాగార్జున, సుహాసిని మిగిలివారంతా కూడా ఇతర పాత్రలు మాత్రమే అంటూ ఆమెను ఒప్పించినట్లు వెల్లడించారు. అలానే జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలో ఆమె నటన చూసి ప్రేక్షకులు నిజంగానే దేవకన్య అన్నంతగా మైమరిచిపోయారని అన్నారు.