నేడు వీర‌మాదేవి ఫ‌స్ట్ లుక్‌

వీర‌మాదేవవి వీర‌లెవ‌ల్లో ఫోజుల్చింది! వీరాధివీరుల‌కు సైతం మ‌తిచెడే దివ్య‌రూపమది. ఈ శుక్ర‌వారం (18 మే) వీర‌మాదేవి
ఫ‌స్ట్ లుక్ లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు సాగుతున్న టైంలో స‌న్నీ షాక్‌ల మీద షాక్ ఇస్తోంది. చెన్న‌య్ వేదిక‌గా సాగే ఈ
వేడుక‌కు స‌న్నీలియోన్ అటెండ్ కానుందని తెలుస్తోంది. ఈలోగానే స‌న్నీఇన్‌స్టాగ్రామ్ లో కొత్త కొత్త ఫొటోషూట్ల‌తో
వేడేక్కిస్తోంది.

ఇటీవ‌లే ఈ భామ ఓ ప్ర‌ఖ్యాత బ్రాండ్ లోదుస్తుల కంపెనీకి ప్ర‌చార‌కర్త‌గా సంత‌కం చేసింది. ఇందుకు భారీ మొత్తాన్నే స‌న్నీ
ఖాతాలో వేసుకుంటోందని స‌మాచారం. లూజ్ చొక్కా‌…టైట్ ఫిట్ లోదుస్తుల్లో ఇలా ద‌ర్శ‌న‌మిచ్చింది. ఏస్ పెహ‌లీ లీలా
మరింత ఘాటుగా ఫోజులిచ్చిందే అంటూ కుర్ర‌కారులో ఒక‌టే డిస్క‌ష‌న్‌. ద‌క్షిణాఫ్రికా కేప్‌టౌన్‌లో భ‌ర్త డేనియాల్ తో క‌లిసి
పుట్టిన రోజు వేడుక‌లు పూర్తి చేసుకున్న స‌న్నీ ఇటీవ‌లే ముంబైకి తిరిగి వ‌చ్చింది. ఇక పై వీర‌మాదేవి ప్రమోష‌న్ స‌హా ఇత‌ర
సినిమాల ప‌నులు చూసుకోనుంద‌ట‌.