నేను క్షేమం..దీపికా ట్వీట్‌

ముంబయిలోని వర్లి ప్రాంతంలోని బ్లూమౌంట్స్‌ టవర్స్‌లో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె నివాసం కూడా ఇదే భవనంలో ఉందని సమాచారం. దీంతో ఆమెకు ఏమైనా ప్రమాదం జరిగిందా అని అభిమానులు ఆందోళన చెందారు. దీనిపై ఆమె ట్విటర్‌ ద్వారా దీపికా స్పందించారు. నేను క్షేమంగానే ఉన్నాను. అందరికీ కృతజ్ఞతలు. వాళ్ల ప్రాణాలను రిస్క్‌లో పెట్టి మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్న అగ్నిమాపక సిబ్బంది కోసం ప్రార్థనలు చెయ్యండి’ అని దీపికా ట్వీట్‌ చేశారు.

బహుళ అంతస్తుల భవనమైన బ్లూమౌంట్స్‌ టవర్స్‌లోని పై అంతస్తులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ టవర్స్‌లోనే దీపికా పదుకొణె నివాసం, ఆమె కార్యాలయం ఉన్నాయి. ఈ ప్రమాదంలో ఆమె ఇంటికి ఎటువంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు. సుమారు 90 మందిని అగ్నిమాపక సిబ్బంది ప్రమాదం నుంచి సురక్షితంగా కాపాడారు. ప్రమాదం కారణంగా పై రెండంతస్తులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ నెలలో ముంబయిలో సంభవించిన మూడో అగ్నిప్రమాదం ఇది.