నేను, నాని చాలా క్లోజ్!

స్టార్ హీరోయిన్ కాజల్.. యంగ్ హీరో నానితో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా చేయలేదు. బయట వీరిద్దరూ కలిసి కనిపించింది లేదు. పార్టీల్లో కూడా కలిసిన దాఖలాలు లేవు. కానీ నాని తనకు ఎమోషనల్ గా చాలా క్లోజ్ అని చెబుతోంది కాజల్. అదెలాగో.. తెలుసుకుందాం. నానిని నిర్మించిన ‘అ!’ సినిమాలో కాజల్ నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరూ క్లోజ్ అయ్యారని తెలుస్తోంది. తమ మధ్య బంధం బయటకు కనిపించేది కాదని, ఎమోషన్స్ తో కూడినదని వెల్లడించింది ఈ బ్యూటీ.
మరిన్ని విషయాలు చెబుతూ.. ‘నేను నాని పెద్దగా కలుసుకోలేదు. బయట కూడా ఒకసారి కలిసినట్లే గుర్తు. అప్పుడు కూడా ఏం మాట్లాడుకోలేదు. కానీ ఇద్దరం ఎమోషనల్ గా బాగా క్లోజ్ అయ్యాం. ఎందుకంటే మా ఇద్దరి ఆలోచన విధానం ఒక్కటే. ఇద్దరికీ పనంటే పిచ్చి. ఒకరి గురించి మరొకరికి బాగా తెలుసు. అంటూ నానిని తెగ పోగిడేసింది. తన నిర్మాతను ఆ మాత్రం పొగడడంలో తప్పులేదు. ఫిబ్రవరి 16న ప్రపంచవ్యాప్తంగా ‘అ!’ సినిమాను విడుదల చేయనున్నారు.