నేను లావైపోవడానికి ఆమె వంటలే కారణం

యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌ ముఖ్యఅతిధిగా ‘ఈ మాయ పేరేమిటో’ సినిమా ఆడియో వేడుక నిన్న ఘనంగా జరిగింది. ప్రముఖ ఫైట్‌ మాస్టర్‌ విజయ్‌ కుమారుడు రాహుల్‌ విజయ్‌ హీరోగా రూపొందిన చిత్రం ‘ఈ మాయ పేరేమిటో’. రొమాంటిక్ ప్రేమ కథగా ఈ మాయ పేరేమిటో చిత్రం తెరకెక్కుతోంది. కాగా ఈ వేడుకకు దర్శకులు పూరి జగన్నాథ్ కూడా మరో అతిధిగా హాజరయ్యారు

ఈ సందర్భంగా అతిథి హోదాలో హాజరైన ఎన్టీఆర్‌ ఫైట్‌ మాస్టర్‌ విజయ్‌తో తనకున్న అనుబంధాన్ని అందరితో పంచుకున్నాడు. ఒకప్పుడు తాను చాలా లావుగా ఉండేవాడినన్ని దానికి కారణాల్లో మాస్టర్‌ మాస్టర్‌ విజయ్‌ భార్య సుమతిగారు కూడా ఒక కారణమని ఎందుకంటే తానెప్పుడు అడిగినా ఆమె ఎన్నో రకాల వంటకాలు చేసి పెట్టేవారని, అలా ఎన్నో సార్లు ఆమె చేతి వంట తిన్నానని. అందుకే చాలా లావుగా ఉండేవాడినని తారక్‌ గుర్తుచేస్తున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates