న‌మిత రీ ఎంట్రీ

తన అందచందాలతో కుర్రకారు హృదయాలను దోచుకున్న ముద్దుగుమ్మ నమిత. విజ‌య్ కాంత్ నటించిన ”ఎంగ‌ల్ అన్నా” అనే త‌మిళ చిత్రంతో తమిళంలో తెరంగేట్రం చేసింది హీరోయిన్ నమిత. కొన్నాళ్లు అగ్ర కథానాయికగా హవా చాటుకుంది. తెలుగులోనూ ప్రముఖ హీరోల సరసన ఆడిపాడింది. త‌రువాత చెన్నైలో సెటిల్ అయింది. ఈ మ‌ధ్య నమితకు అవ‌కాశాలు బాగా త‌గ్గాయి. సంవ‌త్స‌రం క్రితం పెళ్ళి చేసుకున్న నమిత ఆ తర్వాత సినిమా ఇండ‌స్ట్రీకి దూరంగా ఉంటుంది.

ఇక సినిమాలకు స్వస్తి చెప్పినట్లేనని అందరూ అనుకుంటుండగా ఈ మ‌ధ్యనే ఆడియో ఫంక్ష‌న్లలో హంగామా చేస్తోంది నమిత. త్వరలోనే మళ్లీ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వ‌నున్న‌ట్లు కోలివుడ్ లో ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్రముఖ దర్శకుడు టి. రాజేందర్ 11 ఏళ్ల త‌రువాత ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న సినిమాలో నమిత హీరోయిన్ గా చేస్తున్నట్లు సమాచారం. రాజకీయ నేపథ్యంలో సినిమా ఉండొచ్చని అనుకుంటున్నారు. ఈ చిత్రంలో రాధార‌వి ముఖ్యపాత్ర‌ పోషించనున్నారు. ఇంకా ఇతర న‌టుల ఎంపికలు జ‌రుగుతున్న ఈ చిత్రంపై త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడి కావొచ్చు.