‘పడి పడి లేచె మనసు’లో క్రీడాకారిణిగా పల్లవి

‘ఫిదా’ సినిమాతో టాలీవుడ్‌లో నటిగా ఎంట్రీ ఇచ్చిన సాయిపల్లవి. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఆమే సొంతంగా డబ్బింగ్‌ చెప్పుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత ఆమె నటించిన ‘ఎంసీఏ’, ‘కణం’ చిత్రాలు విడుదలయ్యాయి. శర్వానంద్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘పడి పడి లేచె మనసు’. ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తుంది. విశాల్‌ సంగీతం అందిస్తున్నారు. ఎస్‌ఎల్‌వీసీ సినిమాస్‌ బ్యానర్‌పై సుధాకర్‌ చెరుకూరి, ప్రసాద్‌ చుక్కపల్లి నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.

ఈ చిత్రంలో సాయిపల్లవి క్రీడాకారిణిగా కనిపించనున్నారని సమాచారం. ఆమె ఫుట్‌బాల్‌ ప్లేయర్‌గా నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. కాని ఇది ఎంత వరకు నిజమో తెలియాలంటే చిత్ర బృందం ప్రకటన రావాల్సిందే… ఇప్పుడు వరుస సినిమాల్లో హీరోయిన్‌లు క్రీడాకారిణి పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్‌ చిత్రం ‘సూర్మ’లో తాప్సి హాకీ ప్లేయర్‌గా, ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రంలో రష్మికా మందన్న క్రికెటర్‌గా కనిపించనున్నారు