పవన్‌కి బర్త్ డే విషెష్‌ చెప్పిన సినీ నటులు

ఈ రోజు సెప్టెంబర్‌ 2 జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు పవన్‌కల్యాణ్‌ పుట్టినరోజు . ఈ సందర్భంగా పలువురు, సినీ ప్రముఖు, అభిమానుల నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

హ్యాపీ బర్త్‌డే కల్యాణ్‌ బాబాయ్‌. సౌకర్యవంతమైన జీవితాన్ని వదులుకుని చేసి మెరుగైన సమాజం కోసం పాటుపడుతున్న మిమ్మల్ని నేను ఆరాధిస్తాను. మీ త్యాగం నాతో పాటు ఎన్నో లక్షల మంది హృదయాలను గెలుచుకుంది. ఆ శక్తి, ప్రేమ మీతోనే ఉంటుంది. – అల్లు అర్జున్‌
మీ పుట్టినరోజున మీ కలలన్నీ నిజం కావాలని కోరుకుంటున్నా. హ్యాపీ బర్త్‌డే పవర్‌స్టార్‌. – శ్రీకాంత్‌
హ్యాపీ బర్త్‌డే ఒన్‌ అండ్‌ ఓన్లీ పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ గారు. మీరు విజయానికి, పరాజయానికి అతీతం. -ఈషా రెబ్బా
హ్యాపీ బర్త్‌డే పవన్‌కల్యాణ్‌ గారు. ఈ ఏడాది పుట్టినరోజు మీకు చాలా ప్రత్యేకం. ఎందుకంటే వచ్చే ఏడాదికల్లా మీరు రాజకీయ నేత అవుతారు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో మీకు అంతా శుభమే జరగాలని కోరుకుంటున్నా బిగ్‌ బ్రదర్‌. – మంచు మనోజ్‌. ఇంకా సినీ నటులు నితిన్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, రామ్, లావణ్య త్రిపాఠి, హరీష్ శంకర్ రకుల్ ప్రీత్, అల్లరి నరేష్, నిహారిక తదితరులు పవన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.