పవన్‌ కల్యాణ్‌ కంటికి అపరేషన్‌

ప్రముఖ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ కొంత కాలంగా కంటి సమస్యను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఎల్వీప్రసాద్ ఆసుపత్రిలో చేరి శస్త్ర చికిత్స చేయించుకున్నారు.

పది రోజుల క్రితమే పవన్‌ కల్యాణ్‌ ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి వైద్యుల్ని సంప్రదించారు. వారు పవన్ ఎడమ కంట్లో కురుపు ఉన్నట్లుగా గుర్తించారు. అపరేషన్‌ తోనే కురుపును తొలగించాలని తెలిపారు. దీంతో ఆయన బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఎల్వీప్రసాద్ ఆసుపత్రిలో చేరారు. అనంతరం వైద్యులు పవన్‌ కంటికి శస్త్ర చికిత్స చేశారు. సర్జరీ సక్సెస్ అయ్యిందని వైద్యులు వెల్లడించారు. గురువారం సాయంత్రం పవన్‌ని డిశ్చార్జ్ చేసినట్లు వైద్యులు తెలిపారు. పవన్‌కు వైద్యులు కొన్నిరోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తొంది. ఇక.. పవన్‌ ప్రజా పోరాట యాత్ర 16వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లాలో పునఃప్రారంభమవనుంది.