పవన్ కళ్యాణ్ కి ఛాలెంజ్ విసిరిన చిరు

హరిత హారం కార్యక్రమంలో భాగంగా గ్రీన్‌ చాలెంజ్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.  డైరెక్టర్ రాజమౌళి, మహేష్‌ బాబు లాంటి ప్రముఖులు ఇప్పటికే ఇందులో పాల్గొన్నారు. తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి కూడా ఇందులో పాల్గొని మరికొందరికి ఛాలెంజ్ విసిరారు.

ఎన్టీవీ ఛానెల్‌ అధినేత నరేంద్ర చౌదరి విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించిన చిరంజీవి ఇంట్లో మూడు మొక్కలు నాటి కొందరిని నామినేట్‌ చేశారు. బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్ బచ్చన్ తోపాటు, మీడియా మొఘల్‌ రామోజీ రావు, తమ్ముడు పవన్ కళ్యాణ్ కు గ్రీన్‌ చాలెంజ్‌ విసిరారు. ప్రస్తుతం చిరంజీవి సురేందర్‌ రెడ్డి డైరెక్షన్‌లో సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటిస్తున్నారు.