పవన్ గురించి మరోసారి అల్లు అర్జున్!

పవర్‌ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ సినిమాలను వదిలేసి రాజకీయాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు జనాల సమస్యలను తెలుసుకునేందుకు పవన్ స్వయంగా ఆంధ్రప్రదేశ్‌లో పాదయాత్ర చేస్తున్నారు.. ప్రస్తుతం ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విశాఖ, విజయనగరంలో పవన్ కల్యాణ్ పర్యటనలు చేస్తున్నారు. సభలు నిర్వహిస్తూ ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు. పవన్ పాదయాత్రలపై అతడి మేనల్లుడు, స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ స్పందిచాడు.

తన ట్విట్టర్‌ అకౌంట్‌ ద్వారా పవన్‌ ప్రజా పోరాటానికి సంబంధించిన ఒక ఫొటోను షేర్‌ చేస్తూ ‘మీ నిజమైన తత్వంతో మీరు బ్రతకండి..ప్రపంచం దానికదే అడ్జెస్ట్‌ అవుతుంది’ అంటూ ట్వీట్‌ చేస్తూ మరోసారి పవన్‌కు తన మద్దతును ప్రకటించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here